: మురళీమోహన్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీల ఆగ్రహం


లోక్ సభలో ఇవాళ (గురువారం) మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడారు. అత్యాచారాలు తగ్గాలంటే మహిళలు డీసెంట్ గా ఉండే దుస్తులు ధరించాలని ఆయన అన్నారు. మురళీమోహన్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియా సూలే, రంజితా రంజన్ సహా పలువురు మహిళా ఎంపీలు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై రికార్డులను పరిశీలిస్తామని లోక్ సభ ప్యానల్ స్పీకర్ అన్నారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ... తానేం తప్పుగా మాట్లాడలేదన్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మంచిదని మాత్రమే చెప్పానని అన్నారు. మహిళలంటే తనకు చాలా గౌరవమని ఆయన చెప్పారు. తాను మాట్లాడిన దానిలో తప్పేం లేదని, తప్పు చేస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News