: ఈ రెండింటిలో 'బంగారు తెలంగాణ'కు ఏది అద్దంపడుతుందో కేసీఆరే చెప్పాలి: కిషన్ రెడ్డి
‘బంగారు తెలంగాణ’ అంటే రైతులపై లాఠీ చార్జ్ చేయడమా?, లేక గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవం జరపడమా? అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతులు నెత్తురు చిందించడం తెలంగాణ భవిష్యత్ కు మంచిది కాదని అన్నారు. రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిరంకుశం, అకృత్యాలు, అరాచకత్వ పాలనకు సాక్షీభూతంగా నిలిచి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15న తెలంగాణ ప్రజలకు రాకుండా చేసిన గోల్కొండ కోటను ఏ ప్రాతిపదికన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వేదికగా నిర్ణయించారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేయడం సీఎం సొంత విషయం కాదని, తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని ఆయన స్పష్టం చేశారు.