: సమగ్ర సర్వేపై ప్రజలు ఆందోళన పడుతున్నారు: నాగం జనార్థన్ రెడ్డి
ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో ఆందోళన నెలకొందని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి 14 లక్షల మంది వలస వెళ్లారని ఆయన అన్నారు. వలస వెళ్లిన వారంతా తెలంగాణ వారు కానట్టేనా? అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ పై ప్రజల్లో చాలా అంచనాలున్నాయని, ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నాగం జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.