: హిరోషిమాపై అణుదాడికి 69 ఏళ్లు


జపాన్ లోని హిరోషిమా పట్టణంపై అమెరికా చేసిన అణుదాడికి సరిగ్గా 69 ఏళ్లు నిండాయి. రెండో ప్రపంచ యుద్దంలో భాగంగా 1945 ఆగస్టు 6న అమెరికా హిరోషిమాపై 'లిటిల్ బాయ్' అనే అణుబాంబును 'ఎనోలా గే' అనే బీ-29 బాంబర్ విమానం సాయంతో జారవిడిచింది. అంతే హిరోషిమా పట్టణం విలవిల్లాడిపోయింది. ఎటు చూసినా శవాల గుట్టలు, శిథిలమైన భవనాలతో శ్మశానంలా తయారైంది. అణుదాడి ధాటికి ఇప్పటికీ అక్కడ పచ్చిక మొలవదంటే విధ్వంసం తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి దాడి నుంచి బతికి బట్టకట్టిన వారు, అప్పటి సైనికాధికారులు, ప్రజలు జపాన్ లో శాంతి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించారు. మరణించిన తమ పితరులను తలచుకుని మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జపాన్ లో అమెరికా దౌత్యవేత్త కరోలిన్ కెన్నడీ కూడా పాల్గొనడం విశేషం. దీనిపై, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావం ప్రకటించారు. ప్రపంచ శాంతికి అందరం కలిసి పని చేద్దామని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News