: చైనా భూకంప మృతులకు భారత రాష్ట్రపతి సంతాపం


చైనాలో ఆగస్టు 3న సంభవించిన భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో అసువులు బాయడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ కు ఓ సందేశం పంపారు. ఘటన పట్ల ఎంతో విచారిస్తున్నామని ప్రణబ్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తన సందేశంలో తెలిపారు. కాగా, యునాన్ ప్రావిన్స్ ను కుదిపేసిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదైంది.

  • Loading...

More Telugu News