: ఇదీ చంద్రబాబు అనకాపల్లి పర్యటన షెడ్యూల్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన అనకాపల్లికి వస్తున్నారు. ముందుగా బాబు అక్కడి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులతో సమావేశమవుతారు. అటు నుంచి చోడవరం వెళ్లి రైతులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం తిరిగి అనకాపల్లి పట్టణానికి చేరుకుంటారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు, రైతులతో సమావేశమవుతారు. అనకాపల్లిలోని గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేస్తారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం భద్రతా ఏర్పాట్లను మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుతో పాటు జిల్లా అధికారులు పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News