: రైళ్లలో క్యాటరింగ్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు
రైళ్లలో క్యాటరింగ్ ఛార్జీలు పెంచుతూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ లలో ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. దాంతో, భోజనం రూ.125, అల్పాహారం రూ.75, తేనీరు రూ.10లు చేసినట్లు వివరించింది. అంతేకాక రాజధాని, శతాబ్ది, దురంతోలోని ఫస్ట్ ఏసీలో భోజనం రూ.145, తేనీరు రూ.15కు పెంచినట్లు వెల్లడించింది.