: పాకిస్థాన్ సైన్యం అధీనంలో ఉన్న భారత జవాను క్షేమం
పాకిస్థాన్ సైన్యం అధీనంలో ఉన్న బీఎస్ఎఫ్ జవాను క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. అతడిని పాక్ రేపు భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. భారత జవానును తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని బీఎస్ఎఫ్ డీజీ పాథక్ తెలిపారు. ముప్పై ఏళ్ల సత్యశీల్ యాదవ్ చీనాబ్ నది వద్ద పహారా కాస్తుంటాడని, విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోయాడని ఆయన చెప్పారు. ఈ విషయంపై పాక్ రక్షణ శాఖ అధికారులకు వినతితో కూడిన నోటీసు పంపామని పాథక్ పేర్కొన్నారు.