: జడ్జిపైనే లైంగిక వేధింపులుంటే... సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?: పార్లమెంటులో ఎంపీ గీత


దేశంలోని మహిళలపై వేధింపులు ఆగడం లేదని పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీ కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఆమె మాట్లాడుతూ, సాక్షాత్తూ మహిళా జడ్జిపైనే లైంగిక దాడులు జరుగుతుంటే సాధారణ పౌరులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారు, అత్యాచారాలు చేసేవారు బెయిల్ పై విడుదలై బాధితుల కళ్ల ముందే తిరుగుతుంటే వారికి న్యాయం జరిగినట్టు ఎలా భావిస్తారని ఆమె ప్రశ్నించారు. చట్టాలు కఠినంగా అమలైతే న్యాయం జరుగుతుందని ఒత్తిళ్లు లేని పరిపాలన కావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై జరిగే దారుణాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం తనను ఆందోళనకు గురి చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై వివక్షకు అడ్డుకట్ట పడకపోతే భారతదేశం అభివృద్ధి సాధించలేదని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News