: స్టాలిన్ విశ్వాసపాత్రుడు కల్యాణ్ సుందరంపై డీఎంకే వేటు
డీఎంకే నేత స్టాలిన్ కు అత్యంత విశ్వాసపాత్రుడు, నిర్వహణ కార్యదర్శి పి.వి.కల్యాణ్ సుందరంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనపై చర్యలు తీసుకున్నట్లు డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బజగన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్థానంలో పార్టీ లీగల్ వింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతిని నియమించనున్నట్లు చెప్పారు. జులై 30న పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన సుందరం... డీఎంకేలో తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్ పేరును ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు.