: కేబీఆర్ పార్కులో ప్రవేశ రుసుము పెంపుపై హైకోర్టు స్టే
హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్క్ లో ప్రవేశ రుసుముపై హైకోర్టు స్టే విధించింది. పార్క్ లో వాకర్స్ ఎంట్రీ ఫీజును 800 రూపాయల నుంచి రూ.1500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిపై కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఎంట్రీ ఫీజును రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ప్రవేశ రుసుముపై కోర్టు స్టే విధించింది.