: రతన్ టాటాకు మతిభ్రమించిందట!
ప్రఖ్యాత టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మతిభ్రమించినట్టుందని వ్యాఖ్యానించారు పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి అమిత్ మిత్రా. రతన్ టాటా వయసుకు తగ్గ విధంగా మాట్లాడడంలేదని మిత్రా విమర్శించారు. కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ "ఒనార్ మతిభ్రోమ్ హోచే (ఆయనకు మతిభ్రమించినట్టుంది)" అని బెంగాలీలో పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన దాఖలాలేవీ కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. దీనిపై మిత్రా పైవిధంగా స్పందించారు. అంతేగాకుండా, పశ్చిమబెంగాల్లో పరిశ్రమలు పెట్టేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, వాటి పేర్లు చదవాలంటే ఓ రోజు పడుతుందని టాటాకు చురక అంటించారు.