: సమస్యల్లో సైఫ్ అలీఖాన్ 'పద్మ అవార్డు'?


బాలీవుడ్ నటుడు, చోటా నవాబ్ గా పిలుచుకునే సైఫ్ అలీఖాన్ 'పద్మ అవార్డు' సమస్యల్లో పడ్డట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ సర్కిల్లో మంచి పేరున్న సైఫ్ ను గతం ఇంకా వెంటాడుతుండడమే ఇందకు కారణమని ఓ ఆంగ్ల దినప్రతిక ప్రచురించిన కథనం ప్రకారం తెలుస్తోంది. 2012 ఫిబ్రవరిలో కరీనా, మరో ఇద్దరు స్నేహితులతో కలసి సైఫ్ ముంబయిలోని ఓ హోటల్ కు వెళ్లారు. ఆ సమయంలో దక్షిణాఫిక్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త అనుచితంగా ప్రవర్తించాడన్న కారణంతో సైఫ్ అతడిని రక్తం వచ్చేలా కొట్టాడు. దాంతో, అతను సైఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేస్తూ సైఫ్ కు ఇచ్చిన ప్రతిష్ఠాత్మక అవార్డును వెనక్కి తీసుకోవాలని, ముంబయి కోర్టులో అతనిపై అభియోగాలు కూడా నమోదు చేసినట్లు తెలిపాడు. ఈ వివాదం కారణంగానే సైఫ్ కు ప్రకటించిన పద్మ అవార్డును వెనక్కి తీసుకోవచ్చని కథనం.

  • Loading...

More Telugu News