: విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
పట్టణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిందని చంద్రబాబు అన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిలను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 13 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సుదూర తీరప్రాంతం ఉందని ఆయన అన్నారు. తీరం వెంబడి అధునాతన పోర్టులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.