: తెలంగాణ సర్కార్ ప్రతి రోజూ ఏదో ఒక సమస్య సృష్టిస్తోంది: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు
విజయవాడలో 13 జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు దశాదిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి రెండు రాష్ట్రాల్లో గురుతరమైన బాధ్యత ఉందని ఆయన అన్నారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజూ ఏదో ఒక సమస్య సృష్టిస్తోందని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉన్న ఏపీ విద్యార్థులు ఎవరో తెలంగాణ సర్కార్ తేల్చాలని ఆయన అన్నారు. ఏపీ విద్యార్థులను చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఏపీకు సరైన పాలన అందిస్తేనే తమకు మనుగడ ఉంటుందని చంద్రబాబు అన్నారు.