: ఏపీలో ప్రారంభమైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్


ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమయింది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లో కూడా కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 34 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్ కు రావాలని అధికారులు సూచించారు. అయితే, తెలంగాణలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఏపీ ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన అనంతరమే తెలంగాణలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ కు తెలంగాణ ప్రభుత్వం దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాదులో జరుగుతున్న కౌన్సిలింగ్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఏపీ విద్యార్థులతో పాటు, తెలంగాణ విద్యార్థులు కూడా వస్తున్నారు.

  • Loading...

More Telugu News