: నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా, ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్మూర్ లో రూ. 114 కోట్లతో నిర్మించనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం అంకాపూర్ రైతులతో కేసీఆర్ ముఖాముఖి నిర్వహిస్తారు. పర్యటన సందర్భంగా, నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ వరాలజల్లు కురిపిస్తారని జిల్లా నేతలు, ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.

  • Loading...

More Telugu News