: మిజోరం గవర్నర్ కమలాబేణికి ఉద్వాసన
మిజోరం గవర్నర్ కమలాబేణికి ఉద్వాసన పలికారు. యూపీఏ ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ గవర్నర్లకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని, అంతకు ముందే గవర్నర్లు పదవులకు రాజీనామా చేయాలని ఎన్డీయే గవర్నమెంట్ కోరింది. అయినా రాజీనామా చేయకపోవడంతో ఆమెకు ఉద్వాసన పలికారు. ఆమె స్థానంలో బీజేపీ సీనియర్ నేతను నియమించే అవకాశం ఉంది.