: అడుక్కోవడానికి రోజూ కారులో బయలుదేరతాడు!
సౌదీ అరేబియాలో యాచించడం నిషేధం. ఎవరైనా అడుక్కుంటూ పోలీసుల కంటపడితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఆ చట్టాల గురించి తెలిసినప్పటికీ సౌదీ అరేబియాలోని రియాద్ లో ఓ 40 ఏళ్ల వ్యక్తి భిక్షాటన చేస్తూ పోలీసుల కంటపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులకి షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. పోలీసుల విచారణలో తన వద్ద రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని ఆ వ్యక్తి తెలిపాడు. తనతో పాటు తన భార్య, ముగ్గురు పిల్లలు కూడా రోజూ అడుక్కుంటామని ఆ వ్యక్తి తెలియజేశాడు. భిక్షాటన ఎప్పుడూ ఒకే నగరంలో చేయమని ఆయన తెలిపాడు. భిక్షాటన గురించి రోజు కార్లలో వివిధ నగరాలకు బయలుదేరతామని ఆ రిచ్ బెగ్గర్ చెప్పాడు. సౌదీ అరేబియాలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఈ రిచ్ బెగ్గర్ నివసిస్తున్నాడు. గల్ఫ్ దేశానికి చెందిన ఇన్వ్ స్టర్ లైసెన్స్ కూడా ఈ బిచ్చగాడి దగ్గర ఉండడం విశేషం. పోలీసులు అతడి ఆస్తిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని, అతడి కుటుంబాన్ని జైలుకు పంపారు.