: నిజాం పాలన గుర్తు చేస్తున్నారా?: కేసీఆర్ పై దేవినేని విమర్శలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం పాలనను గుర్తు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చేతకానితనం వల్లే తెలంగాణలో విద్యుత్ కష్టాలు పెరిగాయని అన్నారు. పునర్విభజన చట్టంపట్ల కేసీఆర్ కు గౌరవం ఉందా? అని ఆయన నిలదీశారు. ఆచార్య ఎన్జీరంగా గారు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం ఏం చేశారో తెలియకపోతే మేధావులను అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. తామేమీ కేసీఆర్ ను అభ్యర్థించడం లేదని, విభజన చట్టంలోని హక్కులను న్యాయబద్ధంగా అడుగుతున్నామని ఆయన అన్నారు. వీపీటీఎస్ చీఫ్ ఇంజనీర్ గా వరంగల్ కి చెందిన సమ్మయ్య ఉన్నారని, ఆయనను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని దేవినేని ఉమ అన్నారు. ఆర్డీఎస్ కు ఆర్మీని పెట్టి పూర్తి చేయాలా? విభేదాలు, విద్వేషాలు రేపి పబ్బంగడుపుకుందామని చూడడం సరికాదని ఆయన కేసీఆర్ కు హితవు పలికారు. సింగరేణి బొగ్గు కేటాయింపుల్లో వివక్ష వల్లే తెలంగాణకు విద్యుత్ సమస్య ఏర్పడిందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News