: 'పాక్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ అమ్మాయిలను పెళ్లాడకండి'
పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ మహిళలను సౌదీ అరేబియా పురుషులు పెళ్లాడకూడదంటూ ఆ దేశం నిషేధం విధించింది. ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు సౌదీ అరేబియాలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, నిషేధం ఎందుకు విధించారన్నది స్పష్టం చేయలేదు. విదేశీ మహిళలను పెళ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పనిలో పనిగా పెళ్లి నిబంధనలను కూడా కఠినం చేశారు. పెళ్లి దరఖాస్తు చేసుకునేవారు 25 ఏళ్లకు పైబడి ఉండాలనే నిబంధన విధించారు. విడాకులు తీసుకున్న పురుషులు 6 నెలల్లోపు పెళ్లికి దరఖాస్తు చేయకూడదని పేర్కొన్నారు. స్థానిక అధికారుల నుంచి అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.