: అమెరికా అధ్యక్షుడి 'ఆఫ్రికా' అభిమానం


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫ్రికాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆఫ్రికా ఖండంలోని 50కి పైగా దేశాలకు చెందిన నేతలకు వైట్ హౌస్ లో ఘనంగా విందు ఇచ్చారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి 400 మంది హాజరయ్యారు. వైట్ హౌస్ లో దేశాధినేతలకు ఇంతటి భారీ విందు కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి కొందరు భారతీయ అమెరికన్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు విందుకు హాజరవడం పట్ల ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "అమెరికా అధ్యక్షుడిగా మీ ముందు నిలుచున్నా. అమెరికా పౌరుడిగా అందుకు గర్విస్తున్నా. అంతేగాదు, ఆఫ్రికా వ్యక్తికి కుమారుడిగానూ మీ ముందు నిలుచున్నా. మా కుటుంబీకుల్లో ప్రవహిస్తోంది ఆఫ్రికా రక్తమే" అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఒబామా తండ్రి కెన్యాకు చెందిన వ్యక్తి కాగా తల్లి అమెరికన్.

  • Loading...

More Telugu News