: ప్రధాని మోడీపై అపఖ్యాతికర ఆరోపణలు సరికాదు: సుప్రీంకోర్టు
ఓ మహిళపై నిఘా పెట్టాలంటూ నాటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ చట్టవిరుద్ధంగా ఓ పోలీస్ అధికారిని ఆదేశించారంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధానిపై ఇలాంటి అపఖ్యాతికర ఆరోపణలు సరికాదని, తక్షణమే ఆ ఆరోపణలను తొలగించాలని సస్పెన్షన్ కు గురయిన గుజరాత్ ప్రభుత్వాధికారి ప్రదీప్ శర్మను కోర్టు ఆదేశించింది. అయితే, అతనికి వ్యతిరేకంగా గుజరాత్ లో నమోదు చేసిన నాలుగు క్రిమినల్ కేసుల నేపథ్యంలోనే ప్రధానిపై ఈ ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.