: విశాఖ నగరానికి వచ్చిన సినీనటుడు సూర్య
సినీ నటుడు సూర్య విశాఖ నగరానికి వచ్చారు. ఇవాళ సాయంత్రం పోర్టు కళావాహిని ఆడిటోరియంలో జరిగే ‘సికిందర్’ సినిమా ఆడియో సక్సెస్ మీట్ లో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా సూర్యను చూసేందుకు అభిమానులు విశాఖ ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. సూర్య, సమంతా నటించిన సికిందర్ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.