: మేం పేరు మారిస్తే మీకెందుకు ఏడుపు?: కేసీఆర్


ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును జయశంకర్ వర్శిటీగా తెలంగాణ ప్రభుత్వం మార్చడంపై ఏపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై టీఎస్ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మేం పేరు మారిస్తే మీకెందుకు ఏడుపు? మీ బతుకు మీది... మా బతుకు మాది" అంటూ ఎద్దేవా చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణలో జయశంకర్ కంటే గొప్ప నేత లేరని... వర్శిటీకి ఆయన పేరు పెట్టడం మంచి నిర్ణయమేనని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయంలో సార్ లేకపోవడం తీరని లోటుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News