: మాసాయిపేట ఘటనపై విచారణకు ఆదేశించిన కేసీఆర్
మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే గేట్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విచారణకు ఆదేశించారు. అంతేగాకుండా, తక్షణమే సంఘటన స్థలికి వెళ్ళి సహాయకచర్యలను పర్యవేక్షించాలని మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలను ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆయన సూచించారు.