: నేతలు, టీవీ యాంకర్లు, పెట్రోల్ పంపు ఓనర్లు... బ్యాంకు బోర్డుల్లో వీరిదే రాజ్యం!


అధికారికంగా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగేది బ్యాంకుల్లోనే. అలాంటి బ్యాంకులకు సంబంధించిన బోర్డుల్లో ఏ ఆర్థిక నిపుణులో, వ్యాపార దిగ్గజాలో ఉంటారని భావించడం సహజమే. కానీ, వాస్తవంగా అలా జరగడంలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల్లో ఇప్పుడు ఛోటా రాజకీయనేతలు, టీవీ యాంకర్లు, పెట్రోల్ పంపు యజమానులు, మతపరమైన ట్రస్టు సభ్యులు కొలువుదీరుతున్నారు. దీంతో, బ్యాంకుల ఉద్దేశాలు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరించడంతో కేంద్రం ఇటువైపు దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి జీఎస్ సంధూ మాట్లాడుతూ, బ్యాంకు బోర్డుల్లోని స్వతంత్ర డైరక్టర్ల అర్హతలు, అనుభవం వంటి విషయాలపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని సంధూ పేర్కొన్నారు. నెల రోజుల్లో ఈ విషయమై మార్గదర్శకాలు వెలువడతాయని భావిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, గత కొన్నేళ్ళుగా బ్యాంకు వ్యవహారాలను పరిశీలిస్తున్న నిపుణులు... ఏ బ్యాంకు బోర్డులో చూసినా కాంగ్రెస్ పార్టీ నామినీ ఒకరు డైరక్టర్ గా కనిపిస్తారని పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News