: స్నాప్ డీల్ లో రతన్ టాటా పెట్టుబడులు


టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ఇటీవల తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర చర్చ నడుస్తోంది. స్వతంత్ర భారతావనిలో దేశ పారిశ్రామిక రంగానికి ఊపిరులూదిన టాటా గ్రూప్ యజమానిగానే కాక అత్యంత ధనవంతుల జాబితాలో రతన్, ఎప్పుడో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఆయనకు ఏమాత్రం లేదు. అయితే ఆయన మాత్రం ఊహించని వేగంతో దూసుకెళుతున్న ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సదరు రంగంలో సొంతంగానే కంపెనీ పెట్టే స్తోమత ఉన్నా, ఆ దిశగా అంతగా ఆసక్తి చూపని టాటా, కునాల్ బెహల్ నేతృత్వంలోని స్నాప్ డీల్ లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారట. దీనిపై అటు టాటా గాని, బెహల్ గాని ఎలాంటి ప్రకటన చేయకున్నా... దీనిపై ఆరా తీసినప్పుడు మాత్రం బెహల్, సమాధానాన్ని దాటవేశారు తప్పించి, టాటా పెట్టుబడులను ఖండించలేదు. నెల క్రితం ఢిల్లీలోని స్నాప్ డీల్ కార్యాలయాన్ని సందర్శించిన టాటా, పెట్టుబడుల విషయంపై బెహల్ తో చర్చించారు. అయితే సదరు పెట్టుబడులు ఏ మేరకు ఉండనున్నాయి, ఎంత మేర వాటాను టాటా కొనుగోలు చేయనున్నారు, ఈ డీల్ ఎప్పుడు పూర్తవుతుందన్న విషయాలపై స్పష్టత రాలేదు. కేవలం నాలుగేళ్ల ప్రస్థానమున్న స్నాప్ డీల్, టాటా దృష్టిని ఆకట్టుకోవడంలో ఇట్టే సఫలమైంది. టాటా పెట్టుబడులు అందితే, స్నాప్ డీల్ ను బెహల్ మరింత జోరుగా పరుగులు పెట్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

  • Loading...

More Telugu News