: ఎన్జీరంగా యూనివర్సిటీ పేరు మారిస్తే ఒప్పుకోం: ప్రత్తిపాటి పుల్లారావు


హైదరాబాదులోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పేరు మారిస్తే ఒప్పుకోమని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వ్యవసాయరంగానికి నాలుగు వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫిషరీస్ డెవలెప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News