: ఎంపీ కొత్తపల్లి గీతపై ఫేస్ బుక్ లో అసభ్య ప్రచారం చేసిన ఇద్దరి అరెస్ట్
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై ఫేస్ బుక్ లో అసభ్య ప్రచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన ఐ.రవికిరణ్, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పి. సురేష్ కృష్ణ ఉన్నారు. ఫేస్ బుక్ లో అసభ్య ప్రచారం చేస్తున్నారంటూ కొత్తపల్లి గీత పీఏ ఈ నెల ఒకటో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ జీకే వీధి పీఎస్ లో దీనికి సంబంధించి కేసు నమోదైంది.