: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల సిరీస్ మార్పుపై హైకోర్టులో విచారణ
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల సిరీస్ మార్పుపై హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ రామ్ మోహన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టగా, ఏపీ సిరీస్ ను టీఎస్ గా మార్చేందుకు, అభ్యంతరాలను స్వీకరించేందుకే జీవో నెం 3ను విడుదల చేశామని ఈ సందర్భంగా టీఎస్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికిప్పుడు టీఎస్ గా మారే జీవో కాదని చెప్పింది. దాంతో, నష్టమేమీలేదని ఈ సమయంలో కోర్టు పేర్కొంది. ఈ మేరకు అభ్యంతరాలేవైనా ఉంటే తెలపాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. అటు టీఎస్ ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.