: జడలు విప్పుతున్న 'ఎబొలా'... పెరుగుతున్న మృతుల సంఖ్య
ప్రాణాంతక ఎబొలా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ ధాటికి మరణించిన వారి సంఖ్య 887కి చేరింది. ముఖ్యంగా సియెర్రా లియోన్, లైబీరియా దేశాల్లో ఎబొలా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అటు, నైజీరియాలో పలు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా ఈ వైరస్ గినియాలోని అటవీప్రాంతాల్లో వెలుగుచూసింది. అనంతరం పొరుగున ఉన్న సియెర్రా లియోన్, లైబీరియా ప్రాంతాలకు పాకింది.