: ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు నేడు టీమిండియా ఎంపిక


ఇంగ్లండ్ జట్టుతో జరిగే ఐదు వన్డేల సిరీస్ కు గాను నేడు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు సమావేశం కానున్న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆటగాళ్ళను ఎంపిక చేయనుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్నాయి. అక్కడ ఫాస్ట్ పిచ్ లు ఎదురవనున్న నేపథ్యంలో, బౌన్స్, స్వింగ్ ను సమర్థంగా ఎదుర్కోగలిగిన బ్యాట్స్ మెన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆగస్టు 25న ఆరంభం అవుతుంది. ఇంగ్లండ్ తో టీమిండియా ఓ టి20 మ్యాచ్ కూడా ఆడనుంది.

  • Loading...

More Telugu News