: పగలు స్కూలు బ్యాగులు... రాత్రి 'సౌర' బ్యాగులు!


తన ఇంటి పనిమనిషి ఆవేదన ఓ క్రియేటివ్ డిజైనర్ కు ప్రేరణ కలిగించింది. రాత్రి వేళల్లో కరెంటు కోతల కారణంగా పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారన్న ఆ పనిమనిషి సమస్యకు అద్భుతమైన ఆలోచనతో పరిష్కారం చూపారు 34 ఏళ్ళ అనుశీలా సాహా. ఈ డిజైనర్ తన ఆలోచనలకు పదునుపెట్టి ఓ వండర్ స్కూలు బ్యాగును రూపొందించారు. ఆ బ్యాగు రాత్రివేళల్లో కాంతులు విరజిమ్ముతుంది. పగలు సౌరశక్తిని గ్రహించే విధంగా ఆ బ్యాగుకు ఇరుపక్కలా సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేశారు. బ్యాగు ముందు భాగంలోని జిప్ తీస్తే ఎల్ఈడీ లైట్లు కనిపిస్తాయి. అంతేగాకుండా, చిన్నారి కదలికల ఆధారంగానూ శక్తిని ఉత్పత్తి చేసే ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉండడం విశేషం. దాదాపు 8 గంటలపాటు ఇది నిరంతరాయంగా కాంతులు విరజిమ్ముతుంది. స్థానికంగా దొరికే సోలార్ ప్యానెళ్ళు అధిక బరువు కలిగి ఉన్నాయని, అందుకే చైనా నుంచి దిగుమతి చేసుకున్న ప్యానెళ్ళు వినియోగించామని సాహా తెలిపారు. కాగా, ఇలాంటి సోలార్ బ్యాగులు మార్కెట్లో ఉన్నాయి గానీ, వాటి ధర రూ.4500. అయితే, సాహా వీటిని రూ.1500కే తయారుచేయడం విశేషం. వీటిని లాభాపేక్షతో రూపొందించలేదని ఆమె వివరించారు. పిల్లల అభ్యున్నతికి పాటుపడే 'సలాం బాలక్' అనే స్వచ్ఛంద సేవాసంస్థ ఆర్ధిక సహకారంతో సాహా తొలి విడతగా 22 బ్యాగులను తయారు చేశారు. వీటిని సలాం బాలక్ కు చెందిన శాస్త్రి పార్క్ విద్యా కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు అందజేశారు.

  • Loading...

More Telugu News