: వెనుకంజ వేసిన గూగుల్
ఇజ్రాయెల్-గాజా కాన్సెప్ట్ తో రూపొందించిన 'బాంబ్ గాజా' మొబైల్ గేమ్ యాప్ ను గూగుల్ ఉపసంహరించుకుంది. ఈ యాప్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో గూగుల్ ఇంక్ యాప్ స్టోర్ నుంచి దాన్ని తొలగించినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. గూగుల్ విధానాలకు వ్యతిరేకంగా ఉండే యాప్ లను ఉపేక్షించబోమని పేర్కొన్నారు. యాప్ స్టోర్ ఫీడ్ బ్యాక్ పేజిలో ఈ యాప్ పై తీవ్ర వ్యాఖ్యల ఫలితమే తొలగింపు చర్యకు కారణమని తెలుస్తోంది. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే... ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తూ ఉంటాయి. అప్పుడు యూజర్లు చేయాల్సిందల్లా గాజా పౌరులను కాపాడేందుకు బాంబులు జారవిడవాల్సి ఉంటుంది. ఈ యాప్ ను ప్లేఎఫ్టీడబ్ల్యూ రూపొందించింది. ఇది ఇప్పటికీ ఫేస్ బుక్ యూజర్లకు అందుబాటులో ఉంది.