: పెరిగిన గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ధరలు
తమ ఉత్పత్తుల ధరలను ప్రముఖ సిగరెట్ల తయారీ సంస్థ ఐటీసీ పెంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 11 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో, వినియోగదారులపై ఐటీసీ అదనపు భారాన్ని మోపింది. సంస్థ తాజా నిర్ణయంతో, ప్రస్తుతం రూ. 85గా ఉన్న గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ ధర రూ. 95కు చేరుకుంది. దీంతోపాటు, బ్రిస్టల్ ఫిల్టర్ ధర రూ. 45 నుంచి రూ. 47కి... క్యాప్స్ టన్ ఫిల్టర్ ధర రూ. 39 నుంచి రూ. 47కి చేరుకున్నాయి. ఫ్లేక్ ఎక్సెల్ ధర రూ. 39 నుంచి రూ. 45కి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాక్ కు కూడా ఈ ధర వర్తిస్తుందని ఐటీసీ ప్రతినిధి తెలిపారు. అయితే, నేవీ కట్, గోల్డ్ ఫ్లేక్ ఫిల్టర్, గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం, ప్రీమియం ఫిల్టర్, సిజర్స్ ఫిల్టర్ సిగరెట్ల ధరలకు ప్రస్తుతానికి మినహాయింపునిచ్చారు.