: ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ కేసీఆర్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను సరఫరా చేయకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ముద్దునూరు, వీటీపీఎస్ లలో విద్యుదుత్పత్తిని కావాలనే నిలిపివేసి... తెలంగాణకు కరెంట్ రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News