: ఒకే వేదికపైకి బద్ధశత్రువులు
ప్రాణానికి ప్రాణంలా మెలిగి, ఉప్పూ నిప్పులా మారిన ప్రముఖ రాజకీయ నేతలిద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పిన సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రీయ లోకదళ్ ఎంపీ అమర్ సింగ్ రేపు (మంగళవారం) లక్నోలో జరగనున్న జననేశ్వర్ మిశ్రా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొనాలని స్వయంగా ములాయం సింగ్ తనను ఆహ్వానించారని అమర్ సింగ్ తెలిపారు. ములాయం ఆహ్వానం మేరకు పార్కు ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. తమ ఈ కలయిక సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు మాత్రం కాదని అమర్ సింగ్ స్పష్టం చేశారు.