: చంద్రబాబు, ఆయన మంత్రులు గెలిచినట్టు సంబరపడిపోతున్నారు: కడియం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టు అభిప్రాయం విని గెలిచినట్టు సంబరపడిపోతున్నారని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ కౌన్సిలింగ్ పై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఉన్న ఇబ్బందంతా ఫీజు రీయింబర్స్ మెంటుపైనేనని అన్నారు. ఏపీ ప్రభుత్వ నేతలెవరికైనా చేతనైతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని ప్రకటన చేయాలని ఆయన సవాలు విసిరారు. ఉన్న ఇబ్బందంతా ఫీజు రీయింబర్స్ మెంట్ పైనేనని కడియం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News