: నెల్లూరు జిల్లాలో బోరుబావిలో పడిన బాలిక


నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల బాలిక బోరుబావిలో పడిన విషయం వెలుగులోకి వచ్చింది. డక్కిలి మండలంలోని కుప్పాయపాలెం గ్రామ సమీపంలో బాలిక బోరుబావిలో పడినట్లు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చిన్నారి కోసం వెతుకుతుండగా బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడినట్లు గుర్తించారు. బాలికను బయటకు తీయడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News