: కరెంటు మాగ్గావాలె... మేమెందుకిస్తాం?


ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరా చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంఘానికి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీరిన తరువాతే విక్రయం జరుపుతామని, తమ ప్రజల అవసరాలు పక్కనబెట్టి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయలేమని ఏపీ గవర్నమెంట్ కేంద్ర విద్యుత్ సంఘానికి స్పష్టం చేసింది. ఢిల్లీలోని కేంద్ర విద్యుత్ సంఘం ఎదుట హాజరైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు విద్యుత్ అవసరాలపై సమగ్ర వాదన వినిపించారు. హిందూజా పవర్ ప్లాంట్, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ ను తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసింది. అలా ఎలా ఇస్తారని, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అక్కడి ప్రజల హక్కు అని, వారి అవసరాలు తీరిన తరువాతే ఇతర నిర్ణయాలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై న్యాయ సలహా తీసుకున్న తరువాతే పరిష్కారం సూచిస్తామని కేంద్ర విద్యుత్ అథారిటీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News