: రాకెట్లా దూసుకుపోతున్న టమోటా ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో టమోటా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా కిలో టమోటాలు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీకి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి టమోటాలు సరఫరా అవుతాయి. అయితే, అక్కడి నుంచి సప్లయి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మదర్ డైరీ పళ్ళు, కూరగాయల వాణిజ్య విభాగం అధిపతి ప్రదీప్త సాహూ అన్నారు. కాగా, మదర్ డైరీ వారి 'సఫల్' అవుట్ లెట్ల ద్వారా కిలో టమోటాలు రూ.55కే అందిస్తున్నారు. ఇక, దేశంలోకెల్లా అత్యధికంగా భోపాల్ లో కిలో టమోటాల ధర రూ.85 పలుకుతోంది.