: ఇంకా ఆలస్యమెందుకు... కౌన్సిలింగ్ ప్రారంభించండి!: కిషన్ రెడ్డి


సుప్రీంకోర్టు తీర్పుననుసరించి తక్షణమే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా ఆలస్యం చేస్తే తెలంగాణ విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే స్థానికత నిబంధనలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో విద్య అనేది ఉమ్మడి అంశంగా ఉందన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News