: ఒక్క రోజు సర్వే కోసం... రూ.20 కోట్ల నిధుల విడుదల
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజు నిర్వహిస్తోన్న సర్వే కోసం... 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇవాళ (సోమవారం) నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రెండు కోట్ల రూపాయల చొప్పున... పది జిల్లాలకు 20 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది.