: సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల
సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదన్న సంగతి ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూడడం కేసీఆర్ కు తగదని హితవు పలికారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో ముందే తమ మాటను కేసీఆర్ వినుంటే సుప్రీంకోర్టుతో చెప్పించుకునే అవసరం తప్పేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఉమ్మడి అడ్మిషన్లకు ఎలాంటి ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని రావెల సూచించారు.