: కౌన్సిలింగ్ లో ఆంధ్ర, తెలంగాణ అన్న పదాలే ఉచ్చరించవద్దు: సుప్రీంకోర్టు
ఎంసెట్ కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి వచ్చే సోమవారం పూర్తి వివరాలతో ఉత్తర్వులను వెలువరించనుంది. కౌన్సిలింగ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్న పదాలే ఉచ్చరించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఉమ్మడి ప్రవేశాల నిబంధనను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయవద్దని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.