: మెస్సీ, బోల్ట్... ధోనీ ముందు బలాదూర్!
ప్రపంచ క్రీడారంగంలో సంపాదన పరంగా అత్యంత విలువైన ఆటగాళ్ళ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ హేమాహేమీలను వెనక్కినెట్టాడు. అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ లయొనెల్ మెస్సీ, జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్, పోర్చుగల్ సాకర్ హీరో క్రిస్టియానో రొనాల్డో సైతం ఈ జాబితాలో ధోనీ వెనకే. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ కు ఐదో స్థానం దక్కింది. ఇక, ఈ జాబితాలో టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్, గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ సంయుక్తంగా అగ్రస్థానాన్ని అలంకరించారు. వీరిద్దరి ఆదాయం ఏడాదికి రూ.276 కోట్లు. కాగా, ధోనీ ఆదాయం రూ.126 కోట్లు. ఓ ఏడాదిలో ఆటగాళ్ళ ఫీజులు, ఒప్పందాలు ఆధారంగా వారి ఆదాయాన్ని లెక్కగట్టి ఈ జాబితా రూపొందించారు. ఇదిగో పూర్తి జాబితా... 1. ఫెదరర్-టైగర్ వుడ్స్-రూ. 276 కోట్లు 2. లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్ బాల్)-రూ.162 కోట్లు 3. ఫిల్ మైకేల్ సన్ (గోల్ఫ్)-రూ.150 కోట్లు 4. మరియా షరపోవా-రూ.138 కోట్లు 5. ధోనీ-రూ.126 కోట్లు 6. ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్)-రూ.120 కోట్లు 7. కోబ్ బ్రయాంట్ (బాస్కెట్ బాల్)-రూ.114 కోట్లు 8. లి నా (టెన్నిస్)-రూ. 90 కోట్లు 9. క్రిస్టియానో రొనాల్డో- 78 కోట్లు 10. లయొనెల్ మెస్సీ-రూ. 78 కోట్లు