: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రీవాల్ విమర్శలు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. తన పదవి కాపాడుకునేందుకే ఢిల్లీ అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ కేంద్రాన్ని కోరడంలేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట గవర్నర్ వినకపోతే ఐదు నిమిషాల్లో పదవి నుంచి తీసేస్తారన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఢిల్లీలో ఎన్నికలు పెట్టినా తన పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో కలసి జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ర్యాలీలో కేజ్రీ పైవిధంగా మాట్లాడారు.