: నిండుకుండలా శ్రీశైలం రిజర్వాయర్
ఇరు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఇన్ ఫ్లో 3,24,056 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి నీటిమట్టం 855 అడుగులు కాగా... ప్రస్తుతానికి నీటి మట్టం 852.2 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.