: గంగా శుద్ధి కార్యక్రమంలో మేమూ పాల్గొంటాం: జర్మనీ
మోడీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గంగా శుద్ధి కార్యక్రమానికి సహాయం చేసేందుకు జర్మనీ ఆసక్తి చూపుతోంది. హిందువులు పరమపవిత్రంగా పూజించే గంగానదిని శుద్ధి చేయడంలో తమ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జర్మనీ డిప్యూటీ కాన్సుల్ జనరల్ మైకేల్ ఆట్ తెలిపారు. యూరప్ లో ఒకప్పుడు రైన్ నది అత్యంత కాలుష్యపూరితమైన నది అని ఆయన అన్నారు. 1232 కిలోమీటర్లు ప్రవహించే రైన్ నదిని తాము శుభ్రపరిచామని మైకేల్ అట్ తెలిపారు. యూరప్ లోనే అత్యంత పొడవైన రైన్ నదిని ఇప్పుడు డైరెక్ట్ గా తాగునీటి కోసం వాడుకోవచ్చని ఆయన అన్నారు. రైన్ నదిని శుభ్రపరిచిన అనుభవంతోనే తాము గంగాశుద్ధి కార్యక్రమంలో భారత్ కి సహాయం చేయాలనుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.